![]() |
![]() |

శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి.. అందరికి సుపరిచితమే. అందరిని కలుపుకుపోయే శివజ్యోతి మాటతీరుని చూసి ఇష్టపడని వారంటు ఎవరూ ఉండరు. బిగ్ బాస్ ద్వారా కోట్లాది ప్రేక్షకులకు దగ్గర అయింది శివజ్యోతి. బిగ్ బాస్ తో సెలబ్రిటీ లిస్ట్ లో చేరింది.
తీన్మార్ సావిత్రిగా ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసిన శివజ్యోతి.. తన మాట తీరు తో అందరిని ఆకట్టుకుంది. తెలంగాణ యాసతో పాటు తను మాట్లాడే తీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా చేసింది. దాంతో వల్ల మంచి క్రేజ్ సంపాదించుకుంది శివజ్యోతి.. అంతే కాకుండా బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చి హోస్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరిని ఆకట్టుకుంది బిగ్ బాస్ 3 లో మోస్ట్ ఎమోషనల్ గా శివజ్యోతి ని చెప్తారు... బిగ్ బాస్ తర్వాత శివ జ్యోతి కి కెరీర్ కి బ్రేక్ పడింది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతుంది.
శివజ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ప్రేక్షకులకు న్యూస్ ని అందిస్తుంది. శివజ్యోతి న్యూస్ చదవడంలో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది. చమాత్కరంతో వార్తలు చదవడంలో శివజ్యోతి తర్వాతనే మరొకరని అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే శివజ్యోతి తన యూట్యూబ్ ఛానెల్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉంటూ వస్తుంది. శివజ్యోతి భర్త గంగూలీ కూడా అందరికి సుపరిచితమే. అప్పట్లో శివజ్యోతి, గంగూలీ కలిసి ఇస్మార్ట్ జోడిలో పార్టిసిపేట్ చేసి అందరిని మెప్పించారు.
భోనాలకి యాటని కోసినం.. దోస్తులకు దావత్ ఇచ్చినమంటు శివజ్యోతి చేసిన వ్లాగ్ ఎంత వైరల్ అయిందో అందరికి తెలిసిందే. కాగా ఇన్ స్టాగ్రామ్ లో శివజ్యోతి తన భర్త గంగూలీతో కలిసి ఒక రీల్ ని చేసింది. అందులో గంగూలీకి ఒక బ్యాగ్ లో లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ అంటూ అన్నింటిని ప్యాక్ చేసి ఇవ్వగా.. తొందరగా వస్తానే అంటూ గంగూలీ అంటున్నాడు. తీరా చూస్తే అతడిని టాయిలెట్ కి పంపించింది శివజ్యోతి. అసలెందుకిలా చేసిందంటే గంగూలీ బయట కంటే టాయిలెట్ లోనే ఎక్కువ టైమ్ ఉంటాడని శివజ్యోతి భావించి.. ఇదంతా సరదాగా చేసినట్లు చెప్తుంది. కాగా వీళ్ళిద్దరు కలిసి ఇన్ స్టాగ్రామ్ చేసిన ఈ రీల్ కి విశేష స్పందన లభిస్తుంది.
![]() |
![]() |